"కొంచెం ఇష్టం కొంచెం కష్టం" ట్రైలర్ మీ కోసం..
"బాయ్స్" బాయ్ సిద్ధార్థ, "హ్యాపీడేస్" ఫేం తమన్నా జంటగా నటించి తెరకెక్కిన క్రేజీ మూవీ "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". కిషోర్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు.
చిత్ర నిర్మాణ సారధి డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధార్థ ఈ చిత్రంలో కొత్తగా కన్పించాడని, యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు పాటలకు శ్రోతలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని సురేష్ బాబు అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. కథ చెప్పినప్పుడే బడ్జెట్‌లో పరిమితులు లేకుండా నిర్మాత ఎంతగానో సహకరించారని, సంగీత దర్శకుడిగా శంకర్, ఎషాన్‌లొయ్‌ని అడిగిన వెంటనే ఖర్చుకు ఏమాత్రం రాజీపడకుండా అంగీకరించారని దర్శకుడు వెల్లడించారు. మొత్తానికి తన కల నెరవేరిందని, చెప్పింది... చెప్పినట్లు తీయగలిగానని కిషోర్ కుమార్ వెల్లడించారు.
థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిత్రంలో.. ఎంబిఎ చదువుకున్న సిద్ధు (సిద్దార్ధ) సరదాగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఇక గీత (తమన్నా) ఓ జమీందారి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన చదువుకోసం గ్రామం నుంచి సిటీకి వచ్చినప్పుడు... అక్కడ సిద్ధు పరిచయవుతాడు.
ఇలా సిద్ధు, గీత ప్రేమలో పడతారు. వీరి ప్రేమ ఒక్కటవ్వాలంటే.. విడిపోయిన సిద్ధు తల్లిదండ్రులు ఒకటవ్వాలని గీత తండ్రి సుబ్రమణ్యం (నాజర్) షరతు పెడతాడు. ఆ షరతు ప్రకారం సిద్ధు తల్లిదండ్రులు (రమ్యకృష్ణ- ప్రకాష్ రాజ్)లను కలిపి, ప్రేమలో సిద్ధు-గీతలు గెలుపొందుతారా? లేదా అన్నదే సినిమా కథ.
ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, రఘుబాబు, సుధ, హేమ, కరుణ, రవళి, సామ్రాట్, కళ్యాణి తదితరులు నటించారు. ఈ సినిమాకు మాటలు... అబ్బూరి రవి, రచన సహకారం... హరీష్ శంకర్, స్క్రీన్‌ప్లే.. దీపక్ రాజ్, విక్రమ్ సిరి, కెమేరా... విజయ్ కె. చక్రవర్తి. ఈ సినిమాలోని కొన్ని అద్భుత సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...