1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

రామ్ "మస్కా" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ రామ్ మస్కా శత్రువు ఒక్కడు వర్షం సమర సింహారెడ్డి రామ్ హన్సిక షీలా నరసింహనాయుడు ఎంఎస్ రాజు బి గోపాల్
"శత్రువు", "ఒక్కడు", "వర్షం", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మకర (M) సంక్రాంతి (S) రాజుగా పేరు పొందిన సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత, మెగామేకర్ ఎం.ఎస్. రాజు రూపొందించిన భారీ చిత్రం "మస్కా".

"సమర సింహారెడ్డి", "నరసింహనాయుడు" వంటి సంక్రాంతి హిట్స్‌ను రూపొందించిన ఎ-వన్ డైరక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో "దేవదాసు" వంటి పొంగల్ హిట్ కొట్టి, "రెడీ"తో రికార్డ్స్ సృష్టించిన రైజింగ్ స్టార్ రామ్ "మస్కా"లో హీరోగా నటించాడు.

"దేశముదురు"తో సంక్రాంతి బంపర్ హిట్ కొట్టిన అగ్ర హీరోయిన్ హన్సిక "మస్కా"లో రామ్ సరసన నటించింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న "మస్కా" చిత్రం యూత్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ చిత్రం రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రమవుతుందని, ఈ చిత్రానికి చక్రి బెస్ట్ మ్యూజిక్ చేశారని, ఇందులో ఉన్న ఆరు పాటల్ని కందికొండ రాశారని ఎం.ఎస్. రాజు వెల్లడించారు.

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో అన్ని సినిమాల్లో బాగా ఎంటర్‌టైన్ చేసే సునీల్ మళ్లీ "మస్కా"లో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాడని రాజు చెప్పారు. ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, నరేష్, ఝాన్సీ, పరుచూరి వెంకటేశ్వరరావు, తెలంగాణ శకుంతల పాత్రలు విభిన్నంగా ఉంటాయని, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, కృష్ణభగవాన్‌లు హాస్యం పండించారని రాజు తెలిపారు.

ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M