శివాజీ "మస్త్"ను ట్రైలర్లో వీక్షించండి
జీ మోహన్ పిక్చర్స్ నిర్మించిన తెలుగు చిత్రం "మస్త్". శివాజీ, శివబాలాజీ, అర్చన, ముఖుల్ దేవ్, డా. బ్రహ్మానందం, అలీ తదితరులు నటించిన ఈ చిత్రం ఇటీవలే తెరకెక్కింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శివాజీ, ఆంచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆడియో సరిగమ మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
చిత్రం వివరాలను దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తెలియజేస్తూ.. కుటుంబకథా చిత్రాలు తీస్తున్న తాను తొలిసారిగా చక్కని యూత్‌ఫుల్ చిత్రాన్ని రూపొందించానన్నారు. అయినా ఈ సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని చెప్పారు.
యువత భావాలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయనేవి ఈ చిత్రంలో చక్కగా పొందుపరిచామని కృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబోస్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పారు. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని హీరో శివాజీ తెలిపారు.
ఇదిలా ఉంటే... ప్రేమ, స్నేహం, త్యాగం అనే అంశాలతో అల్లిన కథని దర్శకుడు వెల్లడించినా... ఆ విషయాలను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించడంలో అంతగా శ్రద్ధ పెట్టలేదు. ప్రతి సన్నివేశం చూడడానికి ఏమాత్రం బాగుండదు. శివాజీ నటన సైతం సాదాసీదాగానే కన్పిస్తుంది. ఈ చిత్రంలో శివ పాత్ర కళ్లు లేకున్నా బైక్ తోలడం, రౌడీలను కొట్టడంలాంటివి చూచేవారికి విచిత్రంగా అన్పిస్తాయని సినీ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.
బ్రహ్మానందం పాత్ర సైతం చాలా సాదాసీదాగా ఉంటుంది. సునీల్ పాత్ర సైతం ఏమాత్రం రక్తికట్టించదు. ఈ చిత్రంలోని సంగీతం సైతం తూతు మంత్రంగానే సాగుతుందని, ఏపాటా ప్రేక్షకులను ఆకట్టుకోదని సినీ వర్గాల సమాచారం.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో వీక్షించండి.