1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"16 డేస్" ట్రైలర్ మీకోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ 16 డేస్ అరవింద్ ఛార్మీ ప్రభు సాలమన్ డివై చౌదరి కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ కోటశ్రీనివాసరావు
అరవింద్, ఛార్మీ హీరోహీరోయిన్లుగా ప్రభు సాలమన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "16 డేస్". పి. మహేష్‌బాబు డి.వై. చౌదరిల సంయుక్త నిర్మాణ సారథ్యంలో, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విడుదలైన "16 డేస్" ప్రేక్షకులను అలరిస్తోంది. ఉద్యోగం కోసం విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చే గురుమూర్తి (అరవింద్) అనుకోకుండా ఓ మాఫియా ముఠాకు చిక్కుతాడు. ఈ మాఫియా ముఠాకు యాదగిరి (కోటశ్రీనివాసరావు) నాయకుడు. యాదగిరి ప్రత్యర్థి కొడుకును చంపాలన్న ప్లాన్‌తో, పొరబాటున గురుమూర్తిని పట్టుకొస్తారు ఆ ముఠాసభ్యులు.

దీన్ని గ్రహించిన గురుమూర్తి, తను ఆ మాఫియా ముఠా నుంచి బయటపడాలని తెలివిగా ఆలోచిస్తాడు. దీంతో యాదగిరి ప్రత్యర్థి కొడుకును చంపేందుకు గురుమూర్తి ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా యాదగిరికి నచ్చి, ఆ పనిని గురుమూర్తికే అప్పగిస్తాడు. సలహా ఇచ్చి ఇరుక్కున్న గురుమూర్తినే ఆ పనిని చేయమని, లేదంటే చంపేస్తానని యాదగిరి హెచ్చరిస్తాడు.

ఇలా... యాదగిరి ఇచ్చిన పనిని 16 రోజుల్లో అరవింద్ ముగించాడా? లేదా? చార్మి హీరో అరవింద్‌కు ఏవిధంగా సహాయపడిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

అసలు విషయం చెప్పాలంటే.. ఈ చిత్రాన్ని తమిళంలో "లాడమ్" అనే పేరుతో తీశారు. తెలుగులో దీనిని అనువదించి, కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు. ఇందులో ఛార్మీ ప్రధాన పాత్రగా ప్రచారం చేశారు. కానీ కథంతా హీరో అరవింద్ చుట్టూ తిరుగుతుంది. వ్యాపారరీత్యా ఛార్మీని ఎక్స్‌పోజింగ్‌కు ఉపయోగించుకున్నారు. దానికి ఆమె తగిన పారితోషికం కూడా పుచ్చుకుంది.

కోట శ్రీనివాసరావు, జైప్రకాష్ రెడ్డి. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, అలీ, అజయ్, వేణుమాధవ్, మనోరమ తదితరులు నటించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M