"ఆకాశమంత" ట్రైలర్‌ను తిలకించండి
ప్రకాష్, ఐశ్వర్య, త్రిష నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "ఆకాశమంత". ఈ చిత్రం తెలుగు వర్షన్ షూటింగ్ ఇటీవలే ఫిలింసిటీలో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకుడు. దీనికి "ఐ లవ్ మై డాటర్" అనే కాప్షన్ జోడించారు.
తమిళంలో "అభియుమ్ నానుమ్"గా డిసెంబరులో ఈ సినిమా రిలీజ్ అయింది. దీన్ని ప్రకాష్ రాజ్ నిర్మించారు. ఇదే చిత్రం తెలుగు వర్షన్‌ను దిల్‌రాజు తీసుకుని తెలుగు నేటివిటికి సరిపడా సెకండ్ ఆఫ్‌ను మార్చి చిత్రీకరిస్తున్నారు. ఇందులో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. జగపతిబాబు నటించే పార్ట్‌ను త్వరలో చిత్రీకరిస్తామని చెప్పారు. తమ సంస్థలో నటించేందుకు అంగీకరించిన జగపతిబాబుకు దిల్‌రాజు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
తమ సంస్థ రూపొందించే సినిమాలంటేనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయని, వాటికి అనుగుణంగా ఈ చిత్రముంటుందని దిల్ రాజు వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 27వ తేదీ విడుదల చేస్తామని చెప్పారు.
తండ్రీ, కుమార్తెల అనుబంధానికి అద్దం పట్టే ఆకాశమంత చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.