1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"కావ్యాస్ డైరీ"ని ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ఛార్మి మంజుల కావ్యాస్ డైరీ ఇందిర ప్రొడక్షన్స్ సంజయ్ స్వరూప్ వికెప్రకాష్  ఇంద్రజిత్ సత్యం రాజేష్
ఛార్మి, మంజుల (సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె), శశాంక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "కావ్యాస్ డైరీ". ఇందిర ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల భర్త సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.కె.ప్రకాష్ దర్శకుడు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో ఛార్మి నటించింది.

కుటుంబ అనుబంధాలను ప్రధాన కథా వస్తువుగా ఎంచుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కుటంబ విలువలతో పాటు ఆసక్తి కలిగించే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దామని దర్శకుడు తెలిపారు.

ఈ సినిమాలో ఇంద్రజిత్, 'సత్యం' రాజేష్ తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరామేన్: శ్యామ్‌దత్, సంగీతం: మను రమేశన్, మాటలు: వక్కంత వంశీ, ఎడిటర్: మహేష్ నారాయణన్, పాటలు: అనంత శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, కొరియోగ్రఫీ: ప్రసన్న, జెవిఎస్, ఫైట్స్: విజయ్.

ఈ చిత్రంలోని కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
About Writer
SELVI.M