"మొండిమొగుళ్లు పెంకి పెళ్లాలు" ట్రైలర్
రఘుబాబు, శివాజీరాజా హీరోలుగా నటిస్తూ, కుమారి యనమల హర్షిణిరెడ్డి సమర్పిస్తున్న చిత్రం "మొండిమొగుళ్లు పెంకి పెళ్లాలు". మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. రమణారావు దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుందని నిర్మాత యనమల బాబిరెడ్డి అన్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు కె. రమణారావు మాట్లాడుతూ.. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబ కథా చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న కలహాల్ని ఎంటర్‌టైనింగ్ వేలో చూపించే ప్రయత్నం చేశామని రమణారావు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రహ్మానందం, గిరిబాబు, ఎం.ఎస్. నారాయణ, గీతాసింగ్, అల్లరి సుభాషిణి, రాఖీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..