1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"సత్యమేవజయతే" ట్రైలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ రాజశేఖర్ నీతుచంద్ర సంజన సత్యమేవజయతే ఎం సత్యనారాయణరావు జీవిత స్వీయ దర్శకత్వం
డాక్టర్. రాజశేఖర్ హీరోగా, నీతుచంద్ర, సంజన, హీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "సత్యమేవజయతే". ఇందులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ముఖ్యమంత్రిగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో శ్రోతల మన్ననలను చూరగొంటుంది. జీవిత స్వీయ దర్శకత్వంలో, శివానీ శివాత్మిక మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

హిందీ చిత్రం ఖాకీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ కథాగమనాన్ని చాలా వరకు మార్చామని రాజశేఖర్ వెల్లడించారు. ఇంకా రాజశేఖర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఎవడైతేనాకేంటి..?" చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించానని, ఆ సినిమా ఇచ్చినసక్సెస్ స్ఫూర్తితో "సత్యమేవజయతే" కథ రాశానని అన్నారు. "అంకుశం" తరహాలో సాగే ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని రాజశేఖర్ తెలిపారు.

శివాజీ, షాయాజీ షిండే, సాయికిరణ్, శివారెడ్డి, అతుల్ కులకర్ణి, మిలింద్ సోమన్, ఆహుతి ప్రసాద్ తదితరులు నటించి థియేటర్లలో మాస్‌ను ఆకట్టుకుంటోన్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
About Writer
SELVI.M