1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"సిద్ధం" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ సిద్ధం ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు దయానాయక్ జెడి జగపతిబాబు సింధుమీనన్ కిరణ్కుమార్
ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్‌ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా "సిద్ధం" అనే చిత్రం రూపొందింది. జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కిరణ్‌కుమార్ నిర్మించారు.

"హోమం" చిత్రం తర్వాత జె.డి, జగపతిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో, టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారిగా జగపతిబాబు ఇందులో కన్పిస్తారని నిర్మాత అన్నారు. సంఘ విద్రోహశక్తుల్ని తుదిముట్టించడంలో ముందుండే వ్యక్తిగా జగపతిబాబు అద్భుతంగా నటించారని కొనియాడారు.

"ఇంజనీర్లు భవనాలు నిర్మిస్తారు.. డాక్టర్లు వైద్యం చేస్తారు.. నేను చంపుతాను" - అనే పాత్ర జగపతిబాబుదని తెలిపారు. గతంలో తమ సంస్థ నుంచి వచ్చిన "హోమం" సినిమా అందరికీ నచ్చిందని, "సిద్ధం" కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని నిర్మాత వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. భరణి కె. ధరణ్, కూర్పు.. భానోదయ, సంగీతం.. అమర్ మోహిలీ.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M