గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "16 డేస్" ట్రైలర్ మీ కోసం..
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
అరవింద్, ఛార్మి హీరోహీరోయిన్లుగా ప్రభు సాలమన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "16 డేస్". పి. మహేష్‌బాబు డి.వై. చౌదరిల సంయుక్త నిర్మాణ సారథ్యంలో, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విడుదలైన "16 డేస్" ప్రేక్షకులను అలరిస్తోంది.

అసలు విషయం చెప్పాలంటే.. ఈ చిత్రాన్ని తమిళంలో "లాడమ్" అనే పేరుతో తీశారు. తెలుగులో దీనిని అనువదించి, కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు. ఇందులో ఛార్మి ప్రధాన పాత్రగా ప్రచారం చేశారు. కానీ కథంతా హీరో అరవింద్ చుట్టూ తిరుగుతుంది. వ్యాపారరీత్యా ఛార్మీని ఎక్స్‌పోజింగ్‌కు ఉపయోగించుకున్నారు. దానికి ఆమె తగిన పారితోషికం కూడా పుచ్చుకుంది.

కోట శ్రీనివాసరావు, జైప్రకాష్ రెడ్డి. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, అలీ, అజయ్, వేణుమాధవ్, మనోరమ తదితరులు నటించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ అరవింద్ ఛార్మి 16 డేస్ ప్రభు సాలమన్ మహేష్ బాబు లాడమ్ బ్రహ్మానందం