రాజీవ్ కనకాల, అంకిత, శివాజీ రాజా, అభినయశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "పసివాడి ప్రాణం". పి. ఉదయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళారవీంద్ర ఫణిరాజ్, కళా స్వప్నలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.."ఒక డాక్టర్ నిర్లక్ష్యం వలన ఒక "పసివాడి ప్రాణం" పోతే ఆ డాక్టరుకు ఏ విధంగా జ్ఞానోదయం కలిగించారనే కథాంశంతో సందేశాత్మక చిత్రంగా రూపొందించామని చెప్పారు.
శివాజీరాజా, అశోక్‌కుమార్, రఘునాథరెడ్డి, సుమనశ్రీ, రమ్య తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమేరా: వీణా ఆనంద్, సంగీతం: అర్జున్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఉదయభాస్కర్.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో వీక్షించండి.