1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"సత్యమేవజయతే" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ రాజశేఖర్ నీతుచంద్ర సంజన జీవిత ఎమ్మెస్సార్ శివానీ శివాత్మిక మూవీస్
డాక్టర్. రాజశేఖర్, నీతుచంద్ర, సంజన, హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "సత్యమేవజయతే". జీవిత స్వీయ దర్శకత్వంలో, శివానీ శివాత్మిక మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ముఖ్యమంత్రిగా నటించారు.

హిందీ చిత్రం ఖాకీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ కథాగమనాన్ని చాలా వరకు మార్చి తెరకెక్కించామని రాజశేఖర్ వెల్లడించారు. ఇంకా రాజశేఖర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఎవడైతేనాకేంటి..?" చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించానని, ఆ సినిమా ఇచ్చినసక్సెస్ స్ఫూర్తితో "సత్యమేవజయతే" కథ రాశానని అన్నారు. "అంకుశం" తరహాలో సాగే ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని రాజశేఖర్ తెలిపారు.

ఇటీవలే విడుదలై థియేటర్లలో మాస్‌ను అలరిస్తోన్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M