1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

జగపతిబాబు "సిద్ధం" ట్రైలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ జగపతిబాబు సింధు మీనన్ ఐపీఎస్ సీతారామాంజనేయులు దయానాయక్ జెడి
జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "సిద్ధం". ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్‌ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని కిరణ్‌కుమార్ నిర్మించారు.

"హోమం" చిత్రం తర్వాత జె.డి, జగపతిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో, టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారిగా జగపతిబాబు ఇందులో కన్పిస్తారని నిర్మాత అన్నారు. సంఘ విద్రోహశక్తుల్ని తుదిముట్టించడంలో ముందుండే వ్యక్తిగా జగపతిబాబు అద్భుతంగా నటించారని కొనియాడారు. "ఇంజనీర్లు భవనాలు నిర్మిస్తారు.. డాక్టర్లు వైద్యం చేస్తారు.. నేను చంపుతాను" - అనే పాత్ర జగపతిబాబుదని తెలిపారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M