మోనాలిసా కథానాయికగా రామిరెడ్డి, విద్య ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం ఉద్రేకం. దరిశి పవన్‌కుమార్ సమర్పణలో, సుమిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ఇందులో మోనాలిసా చాలా గ్లామర్‌గా కనిపిస్తుందన్నారు. ఆమె క్యారెక్టర్ `కర్తవ్యం'లో విజయశాంతిలా ఉంటుందని, ఈ సినిమా తరువాత ఆమెకు ఛాన్స్‌లు వెల్లువల్లా వస్తాయన్నారు.
ఇకపోతే... సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "జగడం'' చిత్రంలో తన వంపు సొంపులతో ప్రేక్షకులకు కిర్రెక్కించిన బాలీవుడ్ మోనాలిసా, ప్రస్తుతం తన శృంగార నాట్యాలతో ప్రేక్షకులను అలరించేందుకు "ఉద్రేకం'' సినిమాలో నటిస్తోందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. హిందీలో "సి-గ్రేడ్' చిత్రాల్లో మోహమాటం లేకుండా స్కిన్ షో చేసిన ఈ భామకు అవకాశాలు చెప్పుకునేంతగా రావడం లేదు.