గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "సమర్థుడు" ట్రైలర్ మీ కోసం...
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య పాత్రలో రాజా, సంజన (బుజ్జిగాడు ఫేం) జంటగా నటిస్తున్న చిత్రం "సమర్థుడు". బి. గోపాల్, ఇ.వి.వి. సత్యనారాయణ శిష్యుడు అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆకుల సురేష్ పటేల్, ఎన్. విజయ్ రెడ్డిలు సంయుక్త నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది.

రెబల్‌స్టార్ కృష్ణంరాజు "సమర్థుడు" అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. రెగ్యులర్ పాత్ర కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని కృష్ణంరాజు తెలిపారు. ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతలు మరిస్తే శిక్షింపబడాలనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతుందని చెప్పారు.

చిత్ర దర్శకుడు అర్జున్ గురించి కృష్ణంరాజు చెబుతూ, కొత్తవాడు అయినప్పటికీ కథ చెప్పే విధానం బాగా నచ్చిందన్నారు. క్యారెక్టర్ నాకు నచ్చితే, నా భార్య శ్యామలాదేవికి కథంతా నచ్చింది. దీంతో ముందుగా అనుకున్న గోపీకృష్ణా మూవీస్‌ సినిమాను పక్కనబెట్టి "సమర్థుడు"లో నటించాలని నిర్ణయించుకున్నట్టు కృష్ణంరాజు తెలిపారు.

వినోద్ కుమార్, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, సలీమ్ ఫండా, దండపాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... వి. రాజశేఖర్, కెమెరా... దత్తు, మాటలు.. శ్రీను మల్కారి, రచన సహకారం... రాజు ఊడిముడి, జి. సురేష్.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ సమర్థుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజా సంజన బి గోపాల్ ఇవివి అర్జున్