1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"టార్గెట్" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ శివబాలాజీ ముమైత్ఖాన్ శ్రద్ధాదాస్ టార్గెట్ రమేష్ రాజా పతాని రామకృష్ణ గౌడ్
శివబాలాజీ, ముమైత్‌ఖాన్, శ్రద్ధాదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "టార్గెట్". సిరిసాయి సూర్యమూవీస్ పతాకంపై దశరథ్ సంగిశెట్టి. బి. రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రమేష్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

ఈ నెల 20వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాను ఆర్.కె. ఫిలింస్‌పై అన్ని కేంద్రాల్లో విడుదల చేయనున్నట్లు సమర్పకుడు పతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. దర్శకుడు కథను మలచిన తీరు బాగుందని, సినిమాను చూశానని, అద్భుతంగా తెరకెక్కించారని , ముమైత్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు.

ఇంకా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత... ఘంటా శ్రీనివాసరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. రమేష్ రాజా. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి
About Writer
SELVI.M