కృష్ణంరాజు, రాజా, సంజనలు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం "సమర్థుడు". ఈ చిత్రం ఆడియో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సిడీనీ కృష్ణంరాజు విడుదల చేసి దర్శకుడు బి గోపాల్‌కు అందజేశారు. ఆడియో కేసెట్‌ను వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.
ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా.. కృష్ణంరాజు మాట్లాడుతూ, ఈ చిత్ర కథను తనకు మాటలతో పాటు చెప్పినట్లు తెలిపారు. కథ బాగా నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని వ్యాఖ్యానించారు. పాటలు చాలా చక్కగా వచ్చాయి. ప్రేక్షకులకు కూడా ఈ చిత్రంలోని పాటలు నచ్చుతాయని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఈ చిత్రంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.