1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. శింబు, స్నేహల "మా వాడు" ట్రైలర్

Simbu Ma vadu trailer | శింబు, స్నేహల "మా వాడు" ట్రైలర్

వినోదం వెండితెర ట్రైలర్స్ శింబు స్నేహ ప్రభు శిలంబాట్టం మా వాడు ఆర్యన్ మీడియా గ్లామర్ రోల్
తమిళ కథానాయకుడు శింబు, స్నేహ జంటగా నటించగా ఘనవిజయం సాధించిన "శిలంబాట్టం" చిత్రాన్ని తెలుగులో "మావాడు" పేరుతో ఆర్యన్‌ మీడియా పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో స్నేహ అందాలను మనసారా ఆరబోసినట్టు సినీ వర్గాల సమాచారం.

ఫ్యాక్షన్‌ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు దానికి దూరంగా ఎందుకు ఉన్నాడు. ఆ తరువాత అందరిచేత "మావాడు" అని ఎలా అనిపించుకున్నాడు అనేదే చిత్ర కథాంశమని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో శింబు సోదరుడుగా సీనియర్‌ నటుడు ప్రభు నటించారు.

యువన్‌ శంకర్‌రాజా అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమాకు వెన్నెలకంటి సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎస్‌.శరవణన్‌ అద్భుతంగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..