Manorama Trailer | "మనోరమ"ను ట్రైలర్‌లో చూడండి
సాటి మనిషిని ప్రేమించడం.. ప్రేమతో ఏదైనా సాధించవచ్చుననే అంశాన్ని ఈశ్వర్ రెడ్డి "మనోరమ"తో చెప్పించాడు. ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "మనోరమ". జీ మోషన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత గోయెంకా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మీ శ్రేయోభిలాషి' తో చావు ఏ సమస్యకూ పరిష్కారం కాదని చెప్పి.. అందరి ప్రశంసలు అందుకున్న ఈశ్వర్ రెడ్డి, ఈసారి మతం పేరుతో మారణహోమం వద్దనీ, నిజమైన ప్రేమకు అర్ధం చంపడం కాదనే ఇతివృత్తంతో మనోరమను తెరకెక్కించాడు.
ఈరోజే మనది. జీవితమంటే చావడమో చంపడమో కాదన్నదే 'మనోరమ' దర్శకుడు వి.ఈశ్వర్ రెడ్డి అభిమతం. మతం పేరుతో జరుగుతున్న మారణ హోమంలో మానవ మనుగడ ప్రమాదంలో పడింది. పేదవాళ్ల ఆకలి చావుల కంటే మతం పేరుతో జరుగుతున్న మారణకాండంలో పదిరెట్లు అమాయక ప్రజలు బలైపోతున్నారనే సందేశాన్ని మనోరమ ద్వారా చూపించారు మీ "శ్రేయాభిలాషి" దర్శకుడు ఈశ్వర్ రెడ్డి.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..