1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "మా వాడు" ట్రైలర్ మీ కోసం..

Simbu Mavadu Trailer | "మా వాడు" ట్రైలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ మా వాడు శింబు స్నేహ సనాఖాన్ లక్ష్మీ మూవీమేకర్స్ వల్లభ మన్మథ
శింబు, స్నేహా, సనాఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన అనువాద చిత్రం "మా వాడు". ఇటీవల విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. లక్ష్మీ మూవీమేకర్స్ ఇండియా లిమిటెడ్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం విజయవంతమైన సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. శింబు చేసిన డాన్స్, ఫైట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు.

గతంలో తాను నటించిన మన్మథ, వల్లభ చిత్రాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు "మా వాడు" చిత్రాన్ని కూడా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందని హీరో శింబు అన్నారు. వేరే రాష్ట్రం వాడినైనా తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో తెలుగులో ఒక స్ట్రయిట్ చిత్రం చేసే ఆలోచన కూడా ఉందని చెప్పారు.

శింబు యాక్షన్, స్నేహా గ్లామర్‌తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ మా వాడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M