1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "అంజనీపుత్రుడు" ట్రైలర్‌ను తిలకించండి

Anjaniputhrudu Trailer | "అంజనీపుత్రుడు" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ అంజనీపుత్రుడు నాగబాబు ప్రేమ రమ్యకృష్ణ సోషియో ఫాంటసీ వందేమాతరం శ్రీనివాసన్
నాగబాబు, ప్రేమ, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "అంజనీపుత్రుడు". వినాయక ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కె. చంద్రశేఖర్ నిర్మించారు. సోషియో ఫాంటసీ చిత్రంగా మలిచిన ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టు పోషించే హనుమంతుని పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

బాలనటులు నటించే ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ప్రాధాన్యముంది. చిన్నారులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాసన్ సంగీతం సమకూర్చారు.

ఇంకా ఈ సినిమాకు పాటలు.. జొన్నవిత్తుల కరుణాకర్. సునీల్ శర్మ, ఎం.ఎస్. నారాయణ, రామిరెడ్డి, చిదంబరం తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్లో చూసి ఆనందించండి.
About Writer
SELVI.M