1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. శ్రీహరి "సామ్రాజ్యం" ట్రైలర్‌ను తిలకించండి

Sri Hari Samrajyam Trailer | శ్రీహరి "సామ్రాజ్యం" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ శ్రీహరి సామ్రాజ్యం సుమన్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ నిషా కొఠార్ సమీక్ష మాళవిక
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా నటిస్తోన్న చిత్రం "సామ్రాజ్యం". వీరిద్దరూ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ముత్యాల ఆంజనేయులు నిర్మిస్తున్నారు.

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొత్త తరహా కథ ఇదని, ఫ్యాక్షన్ లీడర్‌గా నటిస్తున్నానని హీరో శ్రీహరి చెప్పారు. పగకాకుండా సీమలో ప్రేమకూడా ఉండాలన్నదే కథాంశమని, గొడవలు వద్దని దూరంగా వెళ్ళిన అన్నయ్య చివరికి ఎలా కత్తి పట్టాడు? పరిస్థితులు ఏమిటి? కత్తిపట్టిన తాను చివరికి కత్తిని ఎలా వదిలాను? అన్నవే చిత్రంలోని ప్రధానాంశాలను శ్రీహరి తెలిపారు.

సుమన్ అద్భుతంగా నటించాడని, ఇందులో సీమలో ఆడవాళ్ళు కూడా పగపడితే ఎలా ఉంటుందో? ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది సందేశాత్మకంగా తెరకెక్కించారని శ్రీహరి వెల్లడించారు.

నిర్మాత ముత్యాల ఆంజనేయులు మాట్లాడుతూ.. విక్రమాదిత్య హీరోగా నిషా కొఠార్, సమీక్ష, మాళవిక హీరోయిన్లుగా నటించారన్నారు. ఈ చిత్రానికి సంగీతం.. చక్రి, ఫైట్స్.. రామ్‌లక్ష్మణ్, విజయ్.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా...?