1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "శీనుగాడి"ని ట్రైలర్లో చూడండి

Seenugadu Trailer | "శీనుగాడి"ని ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ రజినీ కాంత్ ధనుష్ శ్రియ శీనుగాడు మహాముదురు లవ్ యాక్షన్ ప్రకాష్ రాజ్
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్‌, శ్రియ నటించిన "తిరువిళ్లైయాడల్" అనే తమిళ చిత్రం "శీనుగాడు మహాముదురు" పేరుతో తెలుగులోకి రానుంది. జి. భూపతి పాండ్యన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తుమ్మల గోపాలరావు సమర్పణలో శ్రీ సౌదామిని క్రియేషన్స్‌ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ, 'లవ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఉండే చిత్రమిదన్నారు. ధనుష్‌, ప్రకాష్‌రాజ్‌ నటన పోటాపోటీగా ఉంటుందని చెప్పారు.

శ్రియ గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కనే యువకుడు, తన ప్రేమను పణంగా పెట్టి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశమని నిర్మాత వివరించారు. ఈ నెల పదోతేదీన తెరపైకి రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.