గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "సామ్రాజ్యం" ట్రైలర్ మీ కోసం.. (Samrajyam Trailer)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా నటిస్తోన్న చిత్రం "సామ్రాజ్యం". ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొత్త తరహా కథ ఇదని, ఫ్యాక్షన్ లీడర్‌గా నటిస్తున్నానని హీరో శ్రీహరి చెప్పారు.

పగకాకుండా సీమలో ప్రేమకూడా ఉండాలన్నదే కథాంశమని, గొడవలు వద్దని దూరంగా వెళ్ళిన అన్నయ్య చివరికి ఎలా కత్తి పట్టాడు? పరిస్థితులు ఏమిటి? కత్తిపట్టిన తాను చివరికి కత్తిని ఎలా వదిలాను? అన్నవే చిత్రంలోని ప్రధానాంశాలను శ్రీహరి తెలిపారు.

ఈ సినిమాలో సుమన్ అద్భుతంగా నటించాడని, ఇందులో సీమలో ఆడవాళ్ళు కూడా పగపడితే ఎలా ఉంటుందో? ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది సందేశాత్మకంగా తెరకెక్కించారని శ్రీహరి వెల్లడించారు.

శ్రీహరి, సుమన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ముత్యాల ఆంజనేయులు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా...?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ శ్రీహరి సుమన్ సామ్రాజ్యం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్