1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. ఛార్మి "మనోరమ" ట్రైలర్ మీ కోసం...

Charmi Manorama Trailer | ఛార్మి "మనోరమ" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్ ఛార్మి మనోరమ జీ మోషన్ పిక్చర్స్ ఈశ్వర్ రెడ్డి మీ శ్రేయోభిలాషి సురేష్
ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "మనోరమ". జీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నటుడు సురేష్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు ఈశ్వర్ రెడ్డి తొలి చిత్రం "మీ శ్రేయోభిలాషి"ని చూసి, ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నానని చెప్పారు.

ఇంతలో ఈశ్వర్ రెడ్డి ఓ కథ చెప్పడం, అది అందరికీ నచ్చడంతో మా సంస్థలో "మనోరమ"ను నిర్మించి తెరకెక్కించామని సురేష్ తెలిపారు. ఈ సినిమాకు కోటి చక్కని సంగీతం సమకూర్చారని డిజిటల్ ఫార్మెట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించామని సురేష్ అన్నారు.

సంగీతానికి ప్రాధాన్యత గల కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్ హైలైట్ నిలిచిందని కోటి అన్నారు. ఖర్చు ఎక్కువైనా నిర్మాతలు ఏ మాత్రం రాజీపడకుండా సినిమా అనుకున్నట్లు ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లారని ఆయన చెప్పారు.

ఇంకా ఈ సినిమాలో నిషాన్, అలీ, ఎం.ఎస్. నారాయణ, ప్రదీప్, ధనుష్, విశ్వేశ్వరరావు, శ్రీ వాత్సవ్ తదితరులు నటించారు. కథ, మాటలు.. పద్మశ్రీ, కెమేరా.. జగన్, జె.ఆర్.జె, ఆర్ట్.. అశోక్, నిర్మాత.. పి. గోయెంకా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. వి. ఈశ్వర్ రెడ్డి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M