1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. శివాజీ, శ్రద్ధాదాస్‌ల "డైరీ" ట్రైలర్ మీ కోసం...

శివాజీ, శ్రద్ధాదాస్‌ల "డైరీ" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ శివాజీ శ్రద్ధాదాస్ మౌషమి మంత్ర చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ చుక్క
శివాజీ, శ్రద్ధాదాస్, మౌషమి ఉదేషి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "డైరీ". ఈ చిత్రానికి మచ్చకంటి రామకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. "మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ చుక్క ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. తెలుగులో "మంత్ర" హిట్టైందని, దాన్ని తమిళంలో డబ్ చేశారని కళ్యాణ్ రామ్ చుక్కా చెప్పారు. హిందీలో కూడా "మంత్ర" సినిమాను రీమేక్ చేస్తున్నారని, అంతగొప్పగా ఆడిన ఆ చిత్రం తర్వాత మరో చిత్రాన్ని నిర్మించాలంటే... కాస్త ఆచితూచి వ్యవహరించి "డైరీ" కథను ఎంచుకున్నానని ఆయన పేర్కొన్నారు.

"మంత్ర" సినిమా కంటే కొత్తకోణంలో ఈ చిత్రముంటుందని హీరో శివాజీ అన్నారు. ఇంకా కామెడీ కూడా సమపాళ్లలో ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించడం థ్రిల్‌గా ఉందని హీరోయిన్ మౌషమి ఉదేషి అన్నారు. తానిందులో మేకప్‌లేకుండా నటిస్తున్నానని శ్రద్ధాదాస్ పేర్కొంది.

ఇకపోతే.. ఈ చిత్రానికి కెమేరా.. శ్రీనివాసరెడ్డి, సంగీతం... ఆనంద్. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.