1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఊహాచిత్రం" ట్రైలర్ మీ కోసం...

Ooha chitram Trailer | "ఊహాచిత్రం" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ వంశీకృష్ణ కావేరీ ఝా పైడిబాబు సత్య ఊహాచిత్రం
వంశీకృష్ణ కథానాయకుడుగా, లిఖిత్‌ ఆర్ట్స్ పతాకంపై సత్య దర్శకత్వంలో పైడిబాబు నిర్మిస్తున్న చిత్రం "ఊహాచిత్రం" ఈ సినిమా పాటలు ఇటీవలే మార్కెట్లోకి విడుదలయ్యాయి. యువకథానాయకుడు తరుణ్‌ ఆడియో ఆవిష్కరించి తొలి ప్రతిని డాక్టర్‌ కె.రవీంద్రనాథ్‌కు అందజేశారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు సత్య మాట్లాడుతూ... తాను వినిపించిన కథకు శివ మంచి పాటలు అందించారన్నారు. తప్పకుండా సినిమా పాటలను శ్రోతలు ఆదరిస్తారని సత్య ఆశించారు.

"నగరం" ఫేమ్ కావేరీఝా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పైడిబాబు వెల్లడించారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.