1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "లైఫ్‌స్టైల్" ఎలా ఉంటుందో ట్రైలర్లో వీక్షించండి

Lifestyle Trailer | "లైఫ్‌స్టైల్" ఎలా ఉంటుందో ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ఎస్ఎమ్ సినీ మ్యాక్స్ ముప్పలనేని శివ నిశ్చల్ కార్తీక్ అభిరామ్ మీనాక్షి దీక్షిత్ మోనాలి చౌదరి అనన్య
ఎస్.ఎమ్ సినీ మ్యాక్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న చిత్రం "లైఫ్‌స్టైల్". ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీజ ఎన్‌సి అనే మహిళ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండగా, నిశ్చల్, కార్తీక్, అభిరామ్‌లు హీరోలుగా, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

బ్యాంకాక్, పట్టాయా, వైజాగ్, బాపట్ల మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరిపామని చిత్ర దర్శకులు ముప్పలనేని శివ తెలిపారు.

ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత శ్రీ మాధవ్ పట్నాయక్ చెప్పారు. బ్రహ్మానందం, గిరిబాబు, సన, శివపార్వతి ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో వీక్షించండి.
About Writer
SELVI.M