1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఆకాశమంత" ట్రైలర్ మీ కోసం..

Akasamanta Trailer | "ఆకాశమంత" ట్రైలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ తండ్రీకూతుళ్లు ఆకాశమంత త్రిష ప్రకాష్ రాజ్ దిల్రాజు
ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన ఆకాశమంత చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. చిన్న సినిమాగా తాము తీసిన 'ఆకాశమంత' చిత్రం పెద్ద హిట్టయిందని ఆయన తెలిపారు.

ఆకాశమంత విజయవంతమైన సందర్భంగా.. చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. 'ఆకాశమంత' చిత్రానికి మంచి గుర్తింపు లభిస్తుందని అంచనా వేశామనీ, అయితే తమ అంచనాలకు మించి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిదన్నారు. చిన్నచిత్రాల్లో మంచి కమర్షియల్ హిట్‌గా ఆకాశమంత చిత్రం నిలుస్తోందని దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

యువతీయువకులతో పాటు పెద్దవాళ్లు కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని నిర్మాత వెల్లడించారు. 30 ప్రింట్లతో సినిమా విడుదల చేశామనీ, ఎన్నికల పూర్తయిన అనంతరం మరికొన్ని ప్రింట్లను పెంచాలనుకుంటున్నామని చెప్పారు.

ఈ సినిమాలోని కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.