1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. ప్రభాస్ "బిల్లా" ట్రైలర్‌ మీ కోసం..

Prabhas Billa Trailer | ప్రభాస్ "బిల్లా" ట్రైలర్‌ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ ప్రభాస్ అనుష్క కృష్ణంరాజు నమిత కృష్ణంరాజు మెహర్ రమేష్
ప్రభాస్, అనుష్క, నమిత హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ రీమేక్ "బిల్లా" థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కంత్రి ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇందులో.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు.

సినిమా విజయవంతమైన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... తమ అంచనాలకంటే అనుగుణంగానే సినిమా విజయం సాధించిందన్నారు. థియేటర్‌లో ప్రేక్షకులు ఏఏ సన్నివేశాలకు స్పందిస్తారని ఊహించామో అదే స్పందన వారి నుంచి రావడం మాకు ఆనందంగా ఉందని మెహర్ అన్నారు.

స్క్రీన్‌ప్లేలోని కొత్తదనమే 'బిల్లా' విజయానికి కారణమంటూ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ వెల్లడించారు.'బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి గ్రేట్‌ మాస్టర్స్‌తో సినిమాలు తీసిన గోపీకృష్ణా సంస్థలో దర్శకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని మెహర్ తెలిపారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.