1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "సర్కస్ సర్కస్"ను ట్రైలర్లో చూడండి

Circus Circus Trailer | "సర్కస్ సర్కస్"ను ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ సర్కస్ సర్కస్ చాందిని విజయ్ ఉష ఎంసింగ్ ఎస్ఉమేష్ కుమార్
ప్రవాసాంధ్రుడు ఎస్.ఉమేష్‌కుమార్ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా "సర్కస్ సర్కస్". చాందిని, విజయ్, ఉష, ఎం.సింగ్ తదితర బాలనటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన శ్యామ్, దాస్ కూడా బాలలే కావడం ఈ సినిమా విశేషం.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ఎంటర్‌టైనర్‌గా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ, చక్కని కుటుంబ కథా చిత్రంగా దర్శకుడు దీనిని మలిచారని ఆయన సోదరి మనీషా పేర్కొన్నారు. ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు అన్నారు.

ఈ సినిమాకు కెమెరా: శరత్, గీతరచన: సతీష్, గాయనీగాయకులు: కారుణ్య, ప్రణవి, మాధవి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.