1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "మేస్త్రీ"ని ట్రైలర్లో వీక్షించండి

Mestri Trailer | "మేస్త్రీ"ని ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ దాసరి నారాయణరావు చంద్రమోహన్ మోహన్ బాబు శ్రీహరి మేస్త్రి కె రామకృష్ణ
దర్శకరత్న దాసరి నారాయణరావు, చంద్రమోహన్, మోహన్ బాబు, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "మేస్త్రి". దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమాకు కె. రామకృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యం వహించారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా భూ సమస్య కోసం మేజర్ తిరుగుబాటు చేసే కథాంశంతో రూపుదిద్దుకుంది.

సహజంగా దాసరి సినిమా అంటేనే కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. అందులోనూ రాజకీయ నేపథ్యం అనే సరికి మరింతగా ఉంటుంది. వెరసి ఈ చిత్రంలో తను చెప్పదలచుకున్న విషయాన్ని దాసరి క్లుప్తంగా చెప్పారు. ప్రధానం షిప్‌యార్డ్ కార్మికులకిచ్చే ప్రభుత్వ భూమి చుట్టూ కథ తిరుగుతుంది. "మా భూమి" చిత్రం నుంచి ఇలాంటి కథలు చాలానే వచ్చాయి.

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో, దానికి అనుగుణంగా కథను మార్చుకుని దాసరి చేసిన ప్రయత్నమే "మేస్త్రీ". ముఖ్యంగా ఓటుహక్కు అంటే సెలవుతీసుకోవడం కాదు. ఓటు వేయనివాడు.. దేశద్రోహితో సమానమని పాట ద్వారా వెల్లడించాడు. అన్నీ ఉచితాలంటూ చెప్పే పార్టీనాయకులను నమ్మొద్దని ప్రజలను మేస్త్రీ హెచ్చరించాడు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.