జల్లు ట్రైలర్ మీ కోసం...

జయంత్ పృథ్వి, ప్రేరణ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం "జల్లు". రేచర్ల మూవీ క్రియేషన్స్ పతాకంపై సుభాష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణాకర్ శిష్యుడు వి.వి. నారాయణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉంది. డబ్బింగ్ పూర్తయి రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇటీవలే విడుదలైన ఆడియాకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత పేర్కొన్నారు. ఆరు పాటలకు నిహాల్ చక్కని బాణీలు సమకూర్చారని ఆయన తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ.. తొలకరి జల్లు ఎంతటి హాయిగా ఉంటుందో చక్కని ప్రేమకథతో కూడిన ఈ జల్లు కూడా అంత మానసికానందాన్ని కల్గిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 22న విడుదలైన ఆడియో హిట్టయిందని, సినిమా కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందన్నారు.
సంగీత దర్శకుడు నిహాల్ మాట్లాడుతూ.. ఆంధ్రేతరులు కూడా ఈ పాటలు బాగున్నాయంటున్నారని, ఎస్.పి. పాడిన "ఓ మౌనమా.." తనకు బాగా నచ్చిన పాటని, ఇంకా ఐదు పాటలు వేటికవి వైవిధ్యంతో కూడినవని నిహాల్ అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.