Lifestyle Trailer | "లైఫ్‌స్టైల్" ట్రైలర్‌ను వీక్షించండి
నిశ్చల్, కార్తీక్, అభిరామ్‌లు హీరోలుగా, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం "లైఫ్‌స్టైల్". ఎస్.ఎమ్ సినీ మ్యాక్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమాను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీజ ఎన్‌సి అనే మహిళ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. బ్యాంకాక్, పట్టాయా, వైజాగ్, బాపట్ల మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్‌ను జరిపామని చిత్ర దర్శకులు ముప్పలనేని శివ తెలిపారు.
ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత శ్రీ మాధవ్ పట్నాయక్ చెప్పారు. బ్రహ్మానందం, గిరిబాబు, సన, శివపార్వతి ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో వీక్షించండి.