Mitrudu Trailer | "మిత్రుడు" ట్రైలర్‌ను తిలకించండి
యువరత్న బాలకృష్ణ, గ్లామర్ తార ప్రియమణి జంటగా నటిస్తోన్న చిత్రం "మిత్రుడు". వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణతెలిపారు.
బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు, గతంలో మ్యూజికల్ హిట్స్ అయ్యాయని, ఈ చిత్రానికి కూడా మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని ఆయన వివరించారు.
మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ పూర్తయిందని, రీరికార్డింగ్ కూడా ప్రారంభమైందని నిర్మాత వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు మలేషియాలో కూడా ఈ చిత్రం షూటింగ్ జరిపామని, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథకు ఎం. రత్నం చక్కటి సంభాషణలు సమకూర్చారని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
త్వరలో తెరపైకి రానున్న మిత్రుడు సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూసి ఆనందించండి.