Mitrudu Trailer | "మిత్రుడు" ఎలా ఉంటాడో ట్రైలర్లో చూడండి
టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి జంటగా నటించిన చిత్రం 'మిత్రుడు'. ఈ చిత్రానికి మహాదేవ్ దర్శకత్వం వహిస్తుండగా, వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
రీ-రికార్డింగ్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. 'మిత్రుడు అనే పేరే అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పారు. ప్రియమణి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని, చక్కటి కుటుంబ కథా చిత్రమిదని నిర్మాత వెల్లడించారు.
ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలియజేశారు. సరదాల్లో, సంబరాల్లో మాత్రమే కాకుండా ఆపదల్లోనూ మనకు చేయూతనిచ్చేవాడే నిజమైన 'మిత్రుడు' అనే అంశంతో చిత్రాన్ని తెరక్కెకిస్తున్నామని శివలెంక వెల్లడించారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.