1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "బంగారుబాబు"ను ట్రైలర్లో చూడండి

Bangarubabu Trailer | "బంగారుబాబు"ను ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ బంగారుబాబు జగపతిబాబు మీరా జాస్మిన్ మురళీమోహన్ షిండే దాసరి నారాయణరావు స్క్రిప్ట్
డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "బంగారుబాబు". ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే ఒకటో తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. చక్కని కుటుంబకథా చిత్రంగా రూపొందిన బంగారుబాబు చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించిందన్నారు. పాటలకు తగ్గట్లుగా పిక్చరైజేషన్ బాగా కుదిరిందని, బంగారుబాబుగా జగపతిబాబు చక్కని నటనను ప్రదర్శించారని నిర్మాత కొనియాడారు. మీరాజాస్మిన్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశించారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని, మంచి సంస్థలో మంచి చిత్రాన్ని తీయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో మురళీమోహన్, షిండే, సోనూసూద్, జయసుధ, హేమ, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, ధర్మవరపు, నారాయణరావు, వైజాగ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ.. దాసరి పద్మ, మాటలు.. మరుధూరి రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. సి.ఎం. కృష్ణ.