1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఆకాశమంత" ట్రైలర్ మీ కోసం..

"ఆకాశమంత" ట్రైలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ తండ్రీకూతుళ్లు ఆకాశమంత త్రిష ప్రకాష్ రాజ్ దిల్రాజు
ప్రకాష్ రాజ్ తండ్రిగా, త్రిష కూతురిగా నటించిన చిత్రం "ఆకాశమంత". శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాధామోహన్ దర్శకుడిగా, దిల్‌రాజు నిర్మించిన ఆకాశమంత చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సినిమాకు, ఆడియోకు మంచి స్పందన వచ్చిందని దిల్‌రాజు వెల్లడించారు.

ఇంకా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. తమ బేనర్‌లో ఇది 8వ చిత్రమని, ఈ చిత్ర కథను ప్రకాష్ రాజ్ తమ పరుగు చిత్రం షూటింగ్‌లో తనకు చెప్పారన్నారు. ఈ చిత్రాన్ని ప్రకాష్‌రాజ్ తమిళంలో నిర్మించారని అదే చిత్రాన్ని తాను తెలుగులో విడుదల చేశామని దిల్‌రాజు తెలిపారు.

ప్రస్తుతం థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న ఆకాశమంత ట్రైలర్‌ను వీక్షించండి.