1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఫ్లాష్‌న్యూస్"ను ట్రైలర్లో చూడండి

Flash News Cinema trailer | "ఫ్లాష్‌న్యూస్"ను ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ఫ్లాష్న్యూస్ సింగిరెడ్డి రంగారెడ్డి రాజీవ్ కనకాల నవనీత్ కౌర్ నాగేంద్రబాబు అలీ
సింగిరెడ్డి రంగారెడ్డి నిర్మాణ సారథ్యంలో జన్యావుల శేషయ్య సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఫ్లాష్‌న్యూస్". అశోక్ దర్శకత్వంలో పుల్లేటి దుర్గామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా గొప్పది. జర్నలిజం అంటే ఏమిటి?, జర్నలిస్టుల పైన ఉన్న బాధ్యతలు, వాళ్ళు చెయాల్సిన పనులు ఈ చిత్రం ద్వారా వివరిస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు. "ఫ్లాష్‌న్యూస్" అంటే మీడియా ఇచ్చే తాజావార్త. సమాజంలో మీడియా పాత్ర గురించి తెలిపేదే తమ ఫ్లాష్‌న్యూస్ అని వారు తెలిపారు.

రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్, కౌశ, నాగేంద్రబాబు, సురేష్, అలీ, రఘుబాబు, విజయరంగరాజు, ఎమ్.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా... సాయి శ్రీరామ్, సంగీతం.. జాన్, ఫైట్స్.. మార్షల్ రమణ.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.