House full Trailer | "హౌస్ఫుల్" ట్రైలర్‌ను తిలకించండి
ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్రసిద్ధార్థ్ నిర్మిస్తోన్న చిత్రం "హౌస్‌ఫుల్". విపిన్, ఆర్య, గౌరీ పండిత్, వేగ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ భూయన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ప్రస్తుతం డీఐ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలోపు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. 'నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ చిత్రముంటుందని ఆయన తెలిపారు. ఐదుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే సరదా కథ ఇదని ఆయన అన్నారు. ఆద్యంతం వినోదాన్ని పంచేలా ఈ సినిమాను తీర్చిదిద్దామని చంద్ర సిద్ధార్థ్ వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రానికి పాటలు: చైతన్యప్రసాద్, పెద్దాడ మూర్తి, అనంతశ్రీరామ్; సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: వి.ఎస్.జ్ఞానశేఖర్.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూడండి.