Nachav Alludu Trailer | "నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌ను తిలకించండి
అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం నచ్చావ్ అల్లుడు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉష సింగంశెట్టి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది.
ఈ సినిమా గురించి అలీ మాట్లాడుతూ.. దర్శకుడు శరత్ పెద్దింటల్లుడు, దొంగల్లుడు, చిన్నల్లుడు వంటి చిత్రాలు తీస్తే ఆయన శిష్యుడు నచ్చావ్ అల్లుడు అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ చిత్రంలో తనలాంటి హాస్యనటలందరూ వైవిధ్యమైన పాత్రలను పోషించారని, ఆద్యంతం నవ్వించే చిత్రమవుతుందని అలీ చెప్పారు.
రఘుబాబు మాట్లాడుతూ.. ఇందులో తాను అమితాబ్ సర్కార్ పాత్రను పేరడీగా పోషించానని, ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆ సినిమా చూసి చేశానన్నారు. ఇది తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్ర అవుతుందని రఘుబాబు నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..