1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. శ్రీహరి "సామ్రాజ్యం"ను ట్రైలర్లో చూడండి

Samrajyam Cinema Trailer | శ్రీహరి "సామ్రాజ్యం"ను ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ శ్రీహరి సుమన్ నిషా కొఠారి మాళవిక ముత్యాల ఆంజనేయులు సమీక్ష
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా నటిస్తోన్న చిత్రం సామ్రాజ్యం. వీరిద్దరూ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ముత్యాల ఆంజనేయులు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి శ్రీహరి మాట్లాడుతూ.. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొత్త తరహా కథ ఇదని, ఫ్యాక్షన్ లీడర్‌గా ఈ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారు. పగ మాత్రమే కాదు సీమలో ప్రేమకూడా ఉండాలన్నదే ఈ చిత్ర కథాంశమన్నారు.

గొడవలు వద్దని దూరంగా వెళ్ళిన అన్నయ్య చివరికి ఎలా కత్తి పట్టాడు? పరిస్థితులు ఏమిటి? కత్తిపట్టిన తాను చివరికి కత్తిని ఎలా వదిలేశాను? అన్నవే చిత్రంలోని ప్రధానాంశాలను శ్రీహరి తెలిపారు.

సుమన్ అద్భుతంగా నటించారని, ఇందులో సీమలో ఆడవాళ్ళు కూడా పగపడితే ఎలా ఉంటుందో? ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది సందేశాత్మకంగా తెరకెక్కించారని శ్రీహరి వెల్లడించారు.

నిర్మాత ముత్యాల ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో విక్రమాదిత్య హీరోగా నిషా కొఠార్, సమీక్ష, మాళవిక హీరోయిన్లుగా నటించారన్నారు. ఈ చిత్రానికి సంగీతం- చక్రి, ఫైట్స్- రామ్‌లక్ష్మణ్, విజయ్.

ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.
About Writer
SELVI.M