1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "స్వీట్‌హార్ట్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

Sweet Heart Cinema Trailer | "స్వీట్‌హార్ట్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ స్వీట్హార్ట్ హీరో ఆకాష్ దర్శకుడు ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధి డైసీ బోపన్న సుహాసిని
హీరో ఆకాష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "స్వీట్ హార్ట్". దేవీ మూవీస్ పతాకంపై ఎన్.జె.రత్నావత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఆకాష్ హీరో.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ఆకాష్ తెలిపారు. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధి పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. డైసీ బోపన్న, సుహాసిని మిగిలిన ఇద్దరు హీరోయిన్లు.

రాహుల్‌దేవ్, బ్రహ్మానందం, చలపతిరావు, సత్యం రాజేష్, బ్రహ్మాజీ, శివారెడ్డి, తదితరులు ఈ చిత్రంలో మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జాక్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మోహన్, డి.శ్రీదేవిపవార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆకాష్.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి
About Writer
SELVI.M