1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "బంగారుబాబు" ట్రైలర్‌ మీ కోసం..

Bangarubabu Trailer | "బంగారుబాబు" ట్రైలర్‌ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ బంగారుబాబు జగపతిబాబు మీరా జాస్మిన్ మురళీమోహన్ షిండే దాసరి నారాయణరావు స్క్రిప్ట్
డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "బంగారుబాబు".

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. చక్కని కుటుంబకథా చిత్రంగా బంగారుబాబు రూపొందిందన్నారు. శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.

పాటలకు తగ్గట్లుగా పిక్చరైజేషన్ బాగా కుదిరిందని, బంగారుబాబుగా జగపతిబాబు చక్కని నటనను ప్రదర్శించారని దర్శకుడు కొనియాడారు. మీరాజాస్మిన్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని, మంచి సంస్థలో మంచి చిత్రాన్ని తీయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో మురళీమోహన్, షిండే, సోనూసూద్, జయసుధ, హేమ, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, ధర్మవరపు, నారాయణరావు, వైజాగ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ.. దాసరి పద్మ, మాటలు.. మరుధూరి రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. సి.ఎం. కృష్ణ.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M