1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "దుర్గి"ని ట్రైలర్లో చూడండి

Durgi Trailer | "దుర్గి"ని ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ శ్రీ చక్ర మూవీ మేకర్స్ ప్రజలు చైతన్యం దుర్గి జ్యోత్స టైటిల్ పాత్ర
శ్రీ చక్ర మూవీ మేకర్స్ పతాకంపై సి.బి. రెడ్డి సమర్పణలో, ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా "దుర్గి" అనే చిత్రం రూపొందుతోంది. బాబ్జీ, తాళ్లబల చంద్రారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆనంద్ సంకారపు దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ అటవీ ప్రాంతంలోని గూడెంలో ఉన్న మూఢాచారం వల్ల 60 ఏళ్ళ వృద్ధుడితో జీవితాంతం గడపాల్సిన పరిస్థితి ఏర్పడడంతో అది సహించలేక ఒక 13 ఏళ్ళ బాలిక ఏవిధంగా మూఢాచారాన్ని ప్రతిఘటించి తనను తాను రక్షించుకుంటుందన్నదే ఈ చిత్ర కథాంశమని దర్శకుడు వెల్లడించారు.

జ్యోత్స టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కొండవలస, నీలిమానాయుడు, విజయానంద్, ఆలపాటి లక్ష్మిణ, కళ్యాణి తదితరులు నటించారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు... సి.హెచ్. రామకృష్ణ, సంగీతం.. ఖుద్దూస్, కెమేరా.. సూర్య.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూడండి.
About Writer
SELVI.M