1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "బంగారుబాబు" ఎలా ఉంటాడో ట్రైలర్లో చూడండి

Bangarubabu cinema Trailer | "బంగారుబాబు" ఎలా ఉంటాడో ట్రైలర్లో చూడండి

వినోదం
డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై తెరకెక్కిన చిత్రం "బంగారుబాబు". ఈ సినిమాకు జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. చక్కని కుటుంబకథా చిత్రంగా బంగారుబాబు రూపొందిందన్నారు. బంగారుబాబుగా జగపతిబాబు చక్కని నటనను ప్రదర్శించారని దర్శకుడు కొనియాడారు.

మీరాజాస్మిన్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు ఆశించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని, మంచి సంస్థలో మంచి చిత్రాన్ని తీయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో మురళీమోహన్, షిండే, సోనూసూద్, జయసుధ, హేమ, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, ధర్మవరపు, నారాయణరావు, వైజాగ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ.. దాసరి పద్మ, మాటలు.. మరుధూరి రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. సి.ఎం. కృష్ణ.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M