1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "హౌస్‌ ఫుల్" ట్రైలర్‌ను తిలకించండి

House full Cinema Trailer | "హౌస్‌ ఫుల్" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం
గోపీచంద్ హీరోగా నటించిన "ఆంధ్రుడు" సినిమాలో కథానాయికగా నటించిన గౌరీపండిట్ తాజాగా "హౌస్ ఫుల్" చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఫిల్మోత్సవ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని చంద్రసిద్దార్థ నిర్మిస్తున్నారు. విపిన్, వేగ, ఆర్యన్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా సంగతులను నిర్మాత తెలియజేస్తూ... టైటిల్‌కు తగిన విధంగానే "హౌస్‌ఫుల్" కథ వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఒక్క రాత్రిలో జరిగే కథను రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

నైనీ దీక్షిత్, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, ఆర్. కె. అంబటి శ్రీను, టార్జన్, సత్తన్న, దాసన్న తదితరులు నటిస్తున్న... ఈ చిత్రానికి కూర్పు.. శ్రావణ్, కెమెరా... వి. ఎస్. జ్ఞానశేఖర్.

ఈ సినిమాలోని అద్భుత సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.