Flash news cinema Trailer | "ఫ్లాష్ న్యూస్" ట్రైలర్ మీ కోసం
సింగిరెడ్డి రంగారెడ్డి నిర్మాణ సారథ్యంలో రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్, కౌశ, నాగేంద్రబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "ఫ్లాష్ న్యూస్". జన్యావుల శేషయ్య సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అశోక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని పుల్లేటి దుర్గామోహన్ నిర్మిస్తున్నారు.
"ఫ్లాష్ న్యూస్" అంటే మీడియా ఇచ్చే తాజావార్త. సమాజంలో మీడియా పాత్ర గురించి తెలిపేదే తమ ఫ్లాష్ న్యూస్ అని నిర్మాతలు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా గొప్పది. జర్నలిజం అంటే ఏమిటి?, జర్నలిస్టుల పైన ఉన్న బాధ్యతలు, వాళ్ళు చెయాల్సిన పనులు ఈ చిత్రం ద్వారా వివరిస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు.
సురేష్, అలీ, రఘుబాబు, విజయరంగరాజు, ఎమ్.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా... సాయి శ్రీరామ్, సంగీతం.. జాన్, ఫైట్స్.. మార్షల్ రమణ.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.