1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. సెక్సీ ఇలియానా "కిక్" పాటల ట్రెయిలర్

Sexy Heroin Ileana and Raviteja's "Kick" Trailers | సెక్సీ ఇలియానా "కిక్" పాటల ట్రెయిలర్

రవితేజ
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన కిక్ సినిమా సైతం అలాంటిదేనని చెప్పవచ్చు. కిక్ చిత్రం దొంగా పోలీస్ కథ. శ్రీనువైట్ల చిత్రాల తరహాలో ఢీ, రెడీ సినిమా ఫార్మెట్‌లో కామెడీని చొప్పించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.

థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న రవితేజ కిక్ చిత్రంలోని పాటల సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT