Ooha chitram Cinema Trailer | ఊహాచిత్రం ట్రైలర్ మీ కోసం..
వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో భాగంగా డీటీఎస్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. రచయితగా పరిశ్రమలోకి వచ్చిన తాను దర్శకుడిగా మారానని తెలిపారు. కథలో కొత్తదనాన్ని చొప్పించడంతోపాటు సినిమాటిక్‌గా మార్చామని, ఊహకందని ట్విస్ట్‌లతో ఊహాచిత్రముంటుందని ఆయన చెప్పారు. సాహిత్యపరంగా సంగీతపరంగా సినిమా హైలైట్ అవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత పైడిబాబు మాట్లాడుతూ ఈ నెలాఖరులో తొలికాపీ సిద్ధమవుతోందని, మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. యూత్ సినిమా కాబట్టి వేసవి సెలవుల వరకు ఆగామని, రొమాంటిక్‌థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించామని ఆయన వివరించారు. కథపై ఉన్న నమ్మకంతో కొత్తవారితో ఈ చిత్రాన్ని రూపుదిద్దామని వెల్లడించారు.
ఈ చిత్రానికి సంగీతం- శివ ఆర్. నందిగామ్, కెమెరా- వి.ఎన్. సురేష్ కుమార్
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.